schedule Wednesday, June 17, 2026

వర్షాల మూలంగా కూలిన ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలి.

calendar_today September 5, 2024
person meenewstelugu

వర్షాల మూలంగా కూలిన ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలి

 

 ఇండ్లు కూలిన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి.

 

 అధికారులు అన్ని గ్రామాలలోపర్యటించాలి

 

 సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

 

మీ:న్యూస్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్ 

 మోతే: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా అనేక ఇండ్లు నేలమట్టం అయ్యాయని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు.బుధవారం మోతే మండల కేంద్రంలో వర్షాల మూలంగా కూలిపోయిన ఇండ్లను సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు రావడం మూలంగా మోతే గ్రామంలో అనేక ఇండ్లు కూలిపోయాయని దీంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కూలి నాలుగు రోజులు అవుతున్న నేటికి అధికారులు కూలిన ఇళ్లను పరిశీలించలేదని అన్నారు. వెంటనే అధికారులుఅన్ని గ్రామాలలో పర్యటించిఇండ్లు కూలిన వారికి నష్టపరిహారంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఇండ్లు కూలిపోయిన వారికిప్రభుత్వం నిత్యవసర వస్తువులుఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలోసిపిఎం మండల కమిటీ సభ్యులు చర్లపల్లి మల్లయ్య, సిపిఎం గ్రామ శాఖ నాయకులు ఎల్లబోయిన రామ్మోహన్, ఎడమ పద్మ, చర్లపల్లి యాదమ్మతదితరులు పాల్గొన్నారు.