ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
September 4, 2024
meenewstelugu
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
కోస్గి మండలంలో కొవ్వొత్తుల ప్రదర్శన
మీ ::న్యూస్ ప్రతినిధి
కోస్గి మండలంలో కొవ్వొత్తుల ప్రదర్శన
మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన బంటీ రాధ అలియాస్ నీల్స్లో చావుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఐక్య వేదిక మరియు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. దళిత మరియు బీసీ నాయకులు బంటీ రాధ హత్యను ముక్తకంఠంతో ఖండించారు. రాధ హత్యకు సీపీఐ,మావోయిస్టులు చెప్తున్న కారణాలు సహేతుకంగా లేవని అనుమానాలు వ్యక్తంచేశారు. నిజంగా రాధ కోవర్ట్ అయితే చంపేస్తారా అని ప్రశ్నించారు. అమాయక దళిత, గిరిజన, ఆదివాసీబిడ్డలను ప్రలోభపెట్టి ఉద్యమంలో చేరుకుని చివరకు పొట్టనపెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు..
ఈ సమావేశంలో ఎస్ సి ఆర్ పి ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిబి వెంకటేష్, జిల్లా అధ్యక్షులు పోకల లక్ష్మణ్ మాట్లాడుతూ
ఇన్ఫార్మర్ల నెపంతో అమాయకులను చంపడం దారుణమని అన్నారు, అతి చిన్న వయస్సులో కులం వివక్షతలను నిర్మూలిద్దాం అని ఉద్యమ బాట పట్టిన రాధ చివరికి దళంలో ఆ కుల వివక్షకే బలైపోయిందని అలాగే పొద్దున లేస్తే పౌర హక్కుల గురించి మాట్లాడే పౌర హక్కుల సంఘాలు ఎందుకు మాట్లాడడం లేదని సిబి వెంకటేష్ ప్రశ్నించారు. మావోలు చేసే హత్యలు హత్యలు కావా, మావోలు చేసినంత మాత్రాన అవి పవిత్ర హత్యలుగా మారిపోతాయి అని ప్రశ్నించారు. హత్య మావోయిస్టులు చేసి అందుకు బాధ్యత పోలీసులు వహించాలని అనడం హాస్యాస్పదమనీ అన్నారు. నిజంలేని మావోయిజం ఫెయిల్ అయిందని...అందుకే నీతిమాలిన పనులకు వాళ్లు తెగబడ్తున్నారనీ మండిపడ్డారు. బీసీ సంఘం ముక్తిపాడు గొల్ల నర్సింలు మాట్లాడుతూ
రాధను అర్ధ నగ్నంగా చేసి మరీ చంపాల్సిన అవసరం ఏమిటని, ఆమె హత్యపై ఎన్నో సందేహాలున్నాయని వాటిని నివృత్తిచేయాల్సిన బాధ్యత మానవహక్కుల సంఘాలకు వామపక్ష అనుబంధ మహిళాసంఘాలకూ ఉందని డిమాండ్ చేశారు. ఎక్కడో ఏదో జరిగితే టీవీలో డిబేట్లు పెట్టే మహిళా ఉద్యమకారులకు రాధ హత్య ఎందుకు కనిపించడంలేదని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నారాయణపేట జిల్లా అధ్యక్షులు పోకల లక్ష్మణ్ నిలదీశారు. అసలు ఒక దళిత సోదరిని ఇలా అన్యాయంగా చంపే హక్కు మావోలకు ఎవరు ఇచ్చారని ధ్వజమెత్తారు. సోదరి దిశా, నిర్భయ , బెంగాల్ డాక్టర్ విషయం లో స్పందించిన రీతిలో సోదరి రాధ విషయంలో కూడా సమాజం స్పందించాలని కోరారు.

