schedule Friday, June 19, 2026

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి:

calendar_today September 1, 2024
person meenewstelugu

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి:

మీ:: న్యూస్ అడ్డ గూడూరు ప్రతినిధి శివ నవీన్ :::అడ్డగూడూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కడారి రమేష్ గారి తండ్రి కడారి పెద్ద మల్లయ్య గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. శనివారం వారి స్వగ్రామం మంగమ్మగూడెం లో జరిగిన దశదినకర్మ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు హాజరయ్యారు. మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పాశం సత్యనారాయణ, మాజీ సర్పంచ్ నారగోని అంజయ్య గౌడ్, సీనియర్ నాయకులు వల్లంబట్ల రవీందర్రావు, బొమ్మగాని లక్ష్మయ్య, బండి నరసింహస్వామి, గూడెపు నాగరాజు, మారిశెట్టి మల్లేష్, కన్నెబోయిన లింగస్వామి, వీరయ్య, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.