మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ సర్పంచ్ కీర్తన ప్రభాకర్ *
calendar_today
March 5, 2026
person
meenewstelugu
మహిళా సంఘం భవన నిర్మాణం కోసం భూమి పూజ
ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్
మీ 31 న్యూస్ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎండి ఖలీల్:: ఝరాసంగం మండలం కప్పా డ్ గ్రమంలో గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికీ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కీర్తన ప్రభాకర్ , ఉప సర్పంచ్ బీరదర్ లక్ష్మి సురేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ భూమి పూజా ముఖ్య ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ .ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు సమావేశం మరియు ఇతర కార్యకలాపాలను సొంత భవనంలో నిర్వహించుకోవడం పల్ల వారి ఆర్థిక, సామాజిక సాధికారత మరింత మెరుగుపడుతుంది. గ్రామ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉంది, ఈ భవనం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని అన్నారు. జహీరాబాద్ ఎంపి సురేష్ శెట్కార్ సహకారంతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని, ప్రజలందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కేతకి డైరెక్టర్ మల్లప్ప పాటిల్,మాజీ సర్పంచ్ నందప్ప పటేల్, కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు