schedule Friday, June 19, 2026

ఇంటి స్థలం కోసం పడరాని పాట్లు పడుతున్న ఓ నిరుపేద

calendar_today August 31, 2024
person meenewstelugu

ఇంటి స్థలం కోసం పడరాని పాట్లు పడుతున్న ఓ నిరుపేద

అధికారుల నుండి బెదిరింపు కాల్స్

అయోమయంలో పడుతున్న కుటుంబ సభ్యులు

న్యాయం చేయాలని అధికారులను కోరుతున్న సుమిత్రయ్య

మీ::న్యూస్ జహీరాబాద్ ప్రతినిధి అశోక్ 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలంలోని వెంకటపూర్ గ్రామానికి చెందిన ఓ నిరుపేద దళిత కులానికి చెందిన సుమిత్రయ్య గత 30 సంవత్సరాలుగా పెంటకుప్ప గా ఉన్న స్థలమును చదును చేసుకొని ఇటీవల కాలంలో ఆ స్థలంలో చిన్న రేకుల షెడ్డు వేసుకోవడంతో ఆ గ్రామానికి చెందిన కొందరుఆ స్థలం విషయంలో ఇబ్బందులు గురిచేస్తున్నారని అధికారులు న్యాయం చేయాలని కోరితే అధికారులు సైతం పట్టించుకోకుండా బెదిరింపు కాల్స్ తో పాటు నోటీసులు అందజేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారని బాధితుడు సుమిత్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామానికి చెందిన వ్యక్తుల ఈ స్థలం పై కన్ను పడటంతో ఏ విధంగానైనా దీని తన సొంతం చేసుకోవాలని ఆలోచించి మాకు ఇబ్బందులు గురి చేస్తున్నారని అన్నారు. పంచాయతీ కార్యదర్శి వారికి బంధువు కావడంతో వారికి సపోర్ట్ చేస్తూ నాపై మరియు మా కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు అందజేసి కాలి చేస్తావా చేయవా లేకపోతే జెసిపి తో తీసివేస్తా అంటూ ఈనెల 29న జెసిబి ని తీసుకొని వచ్చి తొలగించడానికి ప్రయత్నం చేయడంతో నేను అక్కడ కూర్చుని అడ్డు తగలడంతో రేకుల షెడ్డు ను కింద పడేసి వెళ్లిపోయారన్నారు. ప్రతిరోజు ఏదో రకంగా నన్ను ఇబ్బందుల గురిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి పై అదేవిధంగా ఎలాంటి ఆ స్థలం కు సంబంధం లేకుండా నాపై దాడికి దిగుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు..