schedule Saturday, June 13, 2026

దేశం కోసం సైన్యం.. సైన్యం కోసం మనం.

calendar_today May 24, 2025
person meenewstelugu

 దేశం కోసం సైన్యం.. సైన్యం కోసం మనం.

⏩:-తాండూరు లో తిరంగా యాత్ర నిర్వహణ సమితి ఆధ్వర్యంలో

 ⏩:-తిరంగాయాత్ర భారీ ర్యాలీ.

⏩:-మాజీ సైనికులకు సన్మానం

 

 ⏩:-పాల్గొన్న పలు సంఘాల నేతలు యువకులు 

 

  ⏩:-తాండూరులో ర్యాలీ విజయవంతం 

మీ న్యూస్ ప్రతినిధి:-పాకిస్తాన్ ఉగ్రవాదం పై భారత సైన్యం చేసిన ఆపరేషన్ సిందూర్ విజయదుందిమీ మ్రోగించడంతో , మన సైనికుల ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలకు దేశమంతా జై జై లు పలుకుతుంది. ఈ సందర్భంగా దేశం మొత్తం త్రివిధ దళాల సేవలకు ఆపరేషన్ సిందూర్ విజయం పట్ల తిరంగా ర్యాలీని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం లో పట్టణ కేంద్రంలో తిరంగా యాత్ర నిర్వహణ సమితి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా కుల సంఘ నాయకులు తదితరులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తాండూర్ పట్టణ గంజి నుంచి పురవీధుల గుండా భారీగా 75 అడుగుల త్రివర్ణ పతాకాన్ని యువకులు ర్యాలీ తీశారు. అదేవిధంగా ప్రధాన ఇందిరా చౌక్ ప్రాంగణంలో వందేమాతరం, జాతీయ గీతాలను ఆలపిస్తూ మాజీ సైనికులను సన్మానించారు. ఇందులో భారీ ఎత్తున యువకులు ప్రజాసంఘ నాయకులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉగ్రవాద పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధుర్ విజయ దుందుభి మోగించిందని అన్నారు, దేశం కోసం సైన్యం.. సైన్యం కోసం మనం.. అని నిదానంతో ప్రతి ఇంటిలో నుంచి సైన్యాన్ని తయారు చేసే విధంగా ముందుండాలని అన్నారు. దేశ సరిహద్దు లో పోరాడే వీర సైనికుల ఆత్మవిశ్వాసం పొందే విధంగా ప్రతి పౌరుడు ఉండాలని అన్నారు.