schedule Saturday, June 13, 2026

వన మహోత్సవం నాటికి మొక్కలు సిద్ధం చేయాలి

calendar_today May 15, 2025
person meenewstelugu

వన మహోత్సవం నాటికి మొక్కలు సిద్ధం చేయాలి

మీ న్యూస్ ప్రతినిధి:-జిల్లాలో చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయటం జరుగుతుందని రైతులకి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ భరోసా ఇచ్చారు. బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తిరుమలగిరి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా తిరుమలగిరి ఎఎస్ఆర్ రైస్ మిల్లును ఆకస్మితంగా తనిఖీ చేశారు. మిల్లర్లను కొనుగోలు సెంటర్ నుంచి వచ్చిన లారీలను వెంటనే దిగుమతి చేసుకోవాలని హమాలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. 

అనంతరం రాజన్న కోక్యా నాయక్ తండాలోని నర్సరీని సందర్శించి బెడ్ లో ఉన్న ఖాళీలను అందులో నూతన విత్తనం ను వేసి వన మహోత్సవం నాటికి మొక్కలను సిద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించినారు.రాజన్న కొక్య నాయక్ తండా లోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. ఇసుక సకాలంలో అందుతుందా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం చేసే మేస్త్రిని ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఇంటి నిర్మాణం పూర్తిచేయాలని తెలిపినారు.

తదుపరి తొండలోని ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రంలోని సీరియల్ రిజిస్టర్ లను తనిఖీ చేసి సీరియల్ ప్రకారమే కాంటా వేసి మిల్లులకి తరలించాలని నిర్వాహకులకి సూచించారు.నాణ్యత కలిగిన ధాన్యమును కొనుగోలు చేసి గ్రేడింగ్ ను ముందే రైతులకు తెలియజేయాలని నిర్వాహకులకు తెలిపినారు.ఇప్పటి వరకు తొండ ఐకేపీ కొనుగోలు కేంద్రం నుండి 5539.20 క్వింటాల ధాన్యం మిల్లులకి తరలించటం జరిగిందని నిర్వాహకులు కలెక్టర్ కి తెలియజేసారు.

తొండ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థుల యూనిఫాంల కుట్టు కేంద్రాన్ని సందర్శించారు. యూనిఫాములను పరిశీలించి నాణ్యతగా కుట్టాలని మహిళలను కోరారు.

తొండ గ్రామపంచాయతీ రికార్డులను ఆకస్మితంగా తనిఖీ చేశారు.

తదుపరి నిర్మాణంలో ఉన్న తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయం పరిశీలించి నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకి సూచించారు.

మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ శానిటేషన్త్రాగు నీరు సరఫరా,, టాక్స్ వసూలు, బిల్డింగ్ అనుమతులు, యల్ ఆర్ ఎస్ పై పలు విషయాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సివిల్ సప్లై మేనేజర్ ప్రసాద్,తహసిల్దార్ బి. ప్రసాద్,ఎంపీడీవో లాజర్,మున్సిపల్ కమిషనర్ యాదగిరి,మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు ఏపిఎం మధుసూదన్, ఆర్ ఐ లు, పంచాయతీ కార్యదర్సులు యాకుబ్ రెడ్డి,కిరణ్, వి ఏ ఓ సంధ్య, సులోచన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.