ఎమ్మెల్యే ఉత్తమ పద్మావతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నాయకులు
మీ::న్యూస్ సూర్య పేట్ జిల్లా ఇంచార్జీ కోల రవీందర్ గౌడ్
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కట్టుకొమ్ముగూడెం వెళ్లే రోడ్డుకు మహర్దశ పట్టింది. ఎమ్మెల్యే ఉత్తమ పద్మావతి రెడ్డికి ఆరు కోట్ల 25 లక్షల రూపాయలతో ఎస్టిమేషన్ వేసి కౌన్సిలర్లు తిప్పిరి శెట్టి సుశీల రాజు, కట్టేబోయిన శ్రీను లు అందించారు. ఈ సందర్భంగా సూర్యాపేట వెళ్లే రహదారి నుండి పెరిక భవన్ మీదుగా జాతీయ రహదారి వరకు సిసి రోడ్డు, డ్రైనేజ్, ఫుట్ పాత్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ రహదారి 21, 22, 8,30, 31 వార్డుల గుండా వెళ్తుందని, ఇటువైపు ఉన్న ఐదు గ్రామాల ప్రజలకు కూడా ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ రహదారి పై అనేకమంది తెల్లవారుజామున సాయంత్రం వేళల్లో వాకింగ్ కు వెళ్తుంటారని ఎంతోమందికి ఉ పయోగకరంగా ఉంటుందని తెలిపారు. వారి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, వార్డు కౌన్సిలర్ లు కోట మధు, పెండ వెంకటేశ్వర్లు పలువురు నాయకులు పాల్గొన్నారు.