schedule Wednesday, June 17, 2026

దోపిడీ వ్యవస్థపై గళమెత్తి గర్జించిన కవి గాయకుడు అరుణోదయ రామారావు

calendar_today May 6, 2025
person meenewstelugu

దోపిడీ వ్యవస్థపై గళమెత్తి గర్జించిన కవి గాయకుడు అరుణోదయ రామారావు

అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి

మీ న్యూస్ ప్రతినిధి మే 5::సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలోని స్థానిక లాల్ బంగ్లాలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ కళాకారుడు కామ్రేడ్ అరుణోదయ రామారావు 6 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి పాల్గొని మాట్లాడుతూ అణగారిన ప్రజల పక్షాన పల్లవించిన విప్లవ సాంస్కృతిగా సేనాని కామ్రేడ్ అరుణోదయ రామారావు అని అన్నారు. దోపిడీ పోవాలని ఈ వ్యవస్థ మారాలని సమ సమాజం రావాలని గొంతెత్తిన గాయకుడు అనేక ప్రజా ఉద్యమాలలో తన పాట ఆటల ద్వారా ప్రజలను చైతన్య పరిచిన విప్లవ కళాకారుడు అని అన్నారు. కాసుల వేటలో కొట్టుకుపోకుండా తన కలాన్ని గళాన్ని కష్టజీవుల పక్షాన కదిలించిన నికార్సయిన కమ్యూనిస్టు వాగ్గేయకారుడని తెలియజేశారు. నిర్బంధాలు నీడల వెంటాడిన తప్పటడుగులు వేయక నిత్యం సత్యం వెలుగులో పయనించిన కల్మషం లేని విప్లవ కళా ప్రవాహం అరుణోదయ రామారావు అని కొనియాడారు.నేడు దేశంలో పాసిస్తూ శక్తుల ప్రమాదం ముంచుకొస్తున్న తరుణంలో కామ్రేడ్ రామారావు లాంటి అనేకమంది అందించిన విప్లవ కళా చైతన్య స్ఫూర్తితో కవులు కళాకారులు ఫాసిస్టు శక్తులను ఓడించేందుకు ప్రజలను చైతన్య పరచడంలో ముందుండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి వి నరసింహ రావు వీరబాబు, మైసయ్య, కొండలు, సలీం, రవితేజ,నాగేష్, నరసింహరావు,గోపి,సురేష్ తదితరులు పాల్గొన్నారు