schedule Wednesday, June 17, 2026

మానవాళికి దోపిడీ నుండి విముక్తి కలిగించేది ఎర్రజెండా‌ పోరాటాలే

calendar_today May 2, 2025
person meenewstelugu

మానవాళికి దోపిడీ నుండి విముక్తి కలిగించేది ఎర్రజెండా‌ పోరాటాలే

 దేశానికి ప్రత్యామ్నాయం సోషలిజమే

 మే డే స్ఫూర్తితో కార్మికులు తమ హక్కుల సాధన కోసం పోరాటాలు ఉధృతం చేయాలి

 సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు పిలుపు

 

మీ న్యూస్ ప్రతినిధి:: మోతే :ప్రపంచ మానవాళికి దోపిడి నుండి విముక్తి మార్గం కలిగించేది ఎర్రజెండా పోరాటాలె అ‌ని కార్మికులు, కర్షకులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు అన్నారు. గురువారం మేడే సందర్భంగా మోతే మండల పరిధిలోని సిరికొండ, రాఘవాపురం ఎక్స్ రోడ్, రాఘవాపురం, నామవరం, మోతే, రావి పహాడ్, మామిళ్లగూడెం, బిఖ్యా తండా గ్రామాలలో సిపిఎం పార్టీ, సిఐటియు ఆధ్వర్యంలో ఎర్రజెండాలు ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా దేశంలోని చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసం పోరాడి అమరులైన కార్మికుల స్ఫూర్తితో దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుండి అమలవుతున్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ ల గా మార్చి కార్మికుల యొక్క శ్రమను దోచుకుంటుందని అన్నారు. దేశంలో అమలవుతున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వామపక్ష మార్గాలే ప్రత్యామ్నాయమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం లౌకిక ప్రజాస్వామ్య సామ్యవాద విలువలకు తిలోదకాలు ఇచ్చే విధంగా పరిపాలన కొనసాగిస్తూ దేశంలోని మేధావులు అభ్యుదయవాదులు ప్రశ్నించే శక్తులు జర్నలిస్టుల పైన హత్యలు దాడులు దౌర్జన్యాలు చేస్తుందని తెలిపారు. ప్రశ్నించే శక్తులను అంతమందిస్తూ కొంతమంది మత ఉన్మాదాన్ని ప్రేరేపిస్తూ ప్రజల మధ్య వైశ్యామ్యాలు పెంచి పోషిస్తున్నారని అన్నారు. కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని అన్నారు మేడే స్ఫూర్తితో రాబోయే కాలంలో పెరుగుతున్న ధరలు నిరుద్యోగం ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఐక్యంగా పోరాట బాట కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశంలో రాజ్యాంగం రక్షించబడాలన్న ప్రజాస్వామ్యం మనగలగాలన్న పౌరుల హక్కులు కాపాడాలన్న దేశానికి ప్రత్యామ్నాయం వామపక్ష రాజకీయాలు తప్ప మరేవి లేదని పిలుపునిచ్చారు. దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ సామాన్య ప్రజలకు కూడా రక్షణ లేకుండా పరిపాలన కొనసాగిస్తున్న మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే విధంగా పోరాటాల్లోకి ప్రజలు విస్తృతంగా రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆశా అంగన్వాడి వంటి స్కీం వర్కర్లకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని అన్నారు జిల్లాలోని కార్మిక సోదరులకు సిపిఎం పార్టీ తరఫున మేడే శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు కాంపాటి శ్రీను, కిన్నెర పోతయ్య, బూడిద లింగయ్య, చర్లపల్లి మల్లయ్య, జంపాల స్వరాజ్యం, దోస పాటి శ్రీనివాస్, పిడమర్తి అశోక్, నాగం మల్లయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఒగ్గు సైదులు, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల రవిచంద్ర, సిపిఎం నాయకులు కాంపాటి జానయ్య, వెలుగు మధు, సోమ గాని మల్లయ్య, షేక్ జహీనాభి, ఎర్రబోయినమాల్సుర్, బోడపట్ల హుస్సేన్, దోసపాటి ఈదయ్య, ఉపేందర్, మంజుల, షేక్ సైదులు, జలగం తిరుపతయ్య, ఈదయ్య, వెంకన్న, పద్మ, బానోతు లచ్చిరాం, భానోత్ వెంకన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.