schedule Wednesday, June 17, 2026

పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

calendar_today April 5, 2025
person meenewstelugu

పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

ఈ నెల 19 తర్వాత నిరవధిక సమ్మెను విజయవంత చేయండి

జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల రవిచంద్ర

మీ న్యూస్ ఏప్రిల్ 4::తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) మండల ఉపాధ్యక్షులు పొడపంగి లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఎంపీడీవో ఆంజనేయులు గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగినది 

కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల రవిచంద్ర హాజరై మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు గత 40 సంవత్సరాలుగా పంచాయతీ లేని నమ్ముకుని సేవలు చేస్తున్న కనీస వేతనాలు గాని ఉద్యోగ భద్రత గాని లేనటువంటి పరిస్థితి దాపురించిందని ప్రతి నెల వేతనాలు రాని పరిస్థితి ఉందని ముఖ్యమంత్రిగారే స్వయంగా జనవరి నుండి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తానన్న హామీ నేటికి నెరవేరలేదని గత ప్రభుత్వంలో ఇప్పటి మంత్రులు స్వయంగా కనీస వేతనాలు అమలు చేస్తానని మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేస్తానని ఉద్యోగ భద్రత కల్పిస్తానని 34 రోజుల సమ్మెసందర్భంగాఅనేక హామీలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలని అమలు చేస్తుందని గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లిస్తూ చెక్కులు జారీ జేయుంచినప్పటికీ ఎస్టీవో లలో నిధులు లేక నిలిచిపోయాయి తప్ప వేతనాలు వచ్చిన పరిస్థితి లేదని గత ఆరు నెలలుగా ఆగిపోయిన వేతనాలు చెల్లించాలనిగత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 51 ద్వారా నైపుణ్యం లేని పనులు చేయించడం వల్ల రాష్ట్రంలో 200 పైన కార్మికులు చనిపోయారని ఇన్సూరెన్స్ సౌకర్యం లేక ఆ కుటుంబాలు వీధిన పడ్డాయని పంచాయతీలలో దాదాపు 90 శాతం దళితులని వివక్షతతో మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయకుండా ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తుందని 51 జీవో సవరించాలని మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించాలని పర్మినెంట్ చేయాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా అనేక సమ్మెలు పోరాటాలు ధర్నాలు చేస్తున్న నిప్పుల మీద నీళ్లు చల్లిన విధంగా వేతనాలు చెల్లిస్తున్నారని ఇచ్చే వేతనాలు కూడా 9,500 అందరికీ అందడం లేదని ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రి గారే స్వయంగా మా యూనియన్ తో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రంలో అనేక మార్పులు తీసుకొస్తానన్న ప్రభుత్వం మా గ్రామం పంచాయతీ కార్మికులలో మార్పు రావాలంటే మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయడానికి మా యూనియన్ తో పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులతో చర్చలు జరిపించి. మా సమస్యలను పరిష్కరించాలని లేనియెడల ఈనెల 19 తర్వాత ఏరోజు నుండై న రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెలోకి వెళుతున్నామని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సమ్మెలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టి న్యాయం చేయాలని కోరడం జరిగినది అనంతరం మండలంలోని నాయకత్వం అంత రాబోయే కాలంలో నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ

కార్యక్రమంలో సలహాదారులు జలగం తిరపయ్య, పరుశురాములు, నవీన్, స్కైలాబ్, పున్నయ్య, ఉపేందర్, సైదులు, సతీష్, కోటయ్య, అనిల్ మరియు గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు