schedule Wednesday, June 17, 2026

తెలంగాణ రాష్ట్రంలోఐక్య ఉద్యమాలకు కృషి చేస్తున్నాం

calendar_today April 5, 2025
person meenewstelugu

తెలంగాణ రాష్ట్రంలోఐక్య ఉద్యమాలకు కృషి చేస్తున్నాం

 ⏩::ప్రజా, వర్గ పోరాటాలను విస్తృత పరుస్తాం

⏩:: తెలంగాణ గడ్డపై ఎర్ర జెండాకు పూర్వ వైభవాన్ని సాధిస్తాం

⏩:: సిపిఐ(ఎం ) అఖిలభారత 24వ మహాసభలో సిపిఐ(ఎం ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

మీ న్యూస్ ప్రతినిధి:: సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాద బిజెపిపై పోరులో లౌకిక పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు మెతక వైఖరి అవలంబిస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రమాదాన్ని నివారించేందుకు ఐక్య ఉద్యమాలకు కృషి చేస్తున్నామని సిపిఐ(ఎం ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. శుక్రవారం తమిళనాడు రాష్ట్రంలోని మధురై నగరంలో జరుగుతున్న సిపిఐ (ఎం )24వ అఖిలభారత మహాసభలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా ఆమె పాల్గొని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సిపిఎం చేస్తున్న కృషిని వివరిస్తూ మాట్లాడారు. విభజన హామీలు అమలు విషయంలో తెలంగాణకు రావలసిన నిధుల విషయంలో అందరినీ కలుపుకపోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వామపక్షాలను కూడగట్టేందుకు సిపిఐ (ఎం) నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రత్యామ్నాయ ప్రజా అనుకూల ఏజెండాలో లెఫ్ట్ పార్టీలో ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోయేందుకు చొరవ చూపుతున్నాయని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగున్నర లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు సాధించినది వామపక్ష పార్టీలు అన్నారు. హెచ్ సి యు భూములు రాష్ట్ర ప్రభుత్వం అమ్మడాన్ని కి వ్యతిరేకంగా, రామోజీ ఫిలిం సిటీ ఆక్రమించుకున్న భూములకు సాధనకు సిపిఐ(ఎం) నిరంతరం కృషి చేస్తుందన్నారు.

 ప్రజా, వర్గ పోరాటాలను తెలంగాణ రాష్ట్రంలో ఉధృతంగా నిర్వహిస్తూ స్వాతంత్ర కార్యాచరణతో పాటు ఐక్య కార్యాచరణ ఉద్యమాలను లెఫ్ట్ పార్టీలుగా, మరికొన్ని విషయాలలో లౌకిక పార్టీలుగా ముందుకు వెళ్తామన్నారు. హిందుత్వ- కార్పొరేట్ దోపిడి శక్తుల దోపిడి విధానాలను ప్రజలకు వివరిస్తూ సమీకరిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో సిపిఐ( ఎం ) పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు.