schedule Wednesday, June 17, 2026

ఎండిన పొలాలను పరిశీలించిన రైతు సంఘం నేతలు 

calendar_today March 12, 2025
person meenewstelugu

ఎండిన పొలాలను పరిశీలించిన రైతు సంఘం నేతలు 

మీ న్యూస్ ప్రతినిధి మార్చి 12::మండల పరిధిలోని రావిపహాడ్ గ్రామంలో ఎండిన పొలాలను రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకటరెడ్డి మంగళవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సారెస్పీ (శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్) కాలువ ద్వారా నీరు రాకపోవడం వల్ల వరి పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయని, ఎండిన పొలాలను రైతులు పశువులకు మేతగా పొలాల్లోనే మేపుతున్న పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.ఇది ఇలా ఉంటే మిర్చి పంట కూడా పూర్తిగా దెబ్బతిని, కాపు రాని స్థితిలో ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు ఎకరానికి ₹30,000 నష్టపరిహారం మిర్చి క్వింటా కు 25000/- రూపాయలు అందించాలి" అని ఆయన డిమాండ్ చేశారు.రైతుల కష్టాలను ప్రభుత్వం గమనించి అత్యవసర చర్యలు తీసుకోవాలని, లేకుంటే రైతు సంఘం మరింత ఉధృతంగా ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కాంపాటి శ్రీను, సోమ గాని మల్లయ్య, బత్తిని వెంకటేశ్వర్లు, డివైఎఫ్ఐ నాయకులు ఎలుగు మధు చేగువేరా,గ్రామ శాఖ కార్యదర్శి ఎర్రబోయిన మల్సూరు, రైతు సంఘం గ్రామ కార్యదర్శి దాసరి వెంకన్న, రైతులు కోట శేఖర్ రెడ్డి , రమేష్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.