మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640 659560 మార్చి 4::సూర్యాపేట మండలం బాషా నాయక్ తండాలో అదివారం అర్ధరాత్రి దొంగలు రెండిళ్లలో చోరీకి పాల్పడి బంగారం అపహరించుకుపోయారు. ఎస్సై బాలు నాయక్ వివరాలిలా.. బాషా నాయక్ తండాకు చెందిన సంకెల్లంబట్ల రామకుమార్ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. తాళం పగులగొట్టి దుండగులు 17 గ్రాముల పుస్తెలతాడును అపహరించారు. అలాగే శ్రీనివాస్ ఇంట్లో 17 గ్రాముల బ్రాస్లెట్, ఒక ఉంగరం అపహరించారు. కేసు నమోదు అయినట్లు ఎస్ఐ తెలిపారు.