రఘు కుటుంబాన్ని పరామర్శించిన, ఎంజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు దాసు
calendar_today
March 2, 2025
person
meenewstelugu
రఘు కుటుంబాన్ని పరామర్శించిన, ఎంజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు దాసు
మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పడిశాల రఘు ఇటీవల మృతి చెందడంతో శుక్రవారం రఘు నివాసానికి చేరుకొని రఘు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాదిగ జర్నలిస్టుల జాతీయ అధ్యక్షుడు దాసు మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా జర్నలిస్టుల తరఫున ముందుండి ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టాడని అలాగే మాదిగ జర్నలిస్టులకు రాష్ట్ర నాయకుడిగా ఎన్నో సేవలందించారంటూ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రఘు కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. పడిశాల రఘు మృతి పట్ల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారని తెలిపారు. రఘు కుటుంబాన్ని పరామర్శించేందుకు మంద క్రిష్ణ మాదిగ కూడా సిద్ధంగా ఉన్నారని త్వరలోనే రఘు కుటుంబాన్ని పరామర్శిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగ జర్నలిస్టులు మరియు ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలు నాయకులందరూ రఘు కుటుంబానికి అండగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు.