schedule Wednesday, June 17, 2026

బిక్యతండా డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు మౌలిక వసతులు కల్పిస్తాం..కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి

calendar_today March 2, 2025
person meenewstelugu

బిక్యతండా డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు మౌలిక వసతులు కల్పిస్తాం..కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి

 

మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని బిక్యతండా గ్రామంలో గత ప్రభుత్వం 60 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేసింది. అయితే వాటికి కనీస వసతులు కల్పించకపోవడంతో తండావాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో వారి బాధలను పంచుకున్నారు. గత పది సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ఇండ్లను నిర్మించినప్పటికీ కరెంటు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలు కల్పించకపోవడంతో తండావాసులు నానా అవస్థలు పడుతున్నారని కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్ నాయకుల పై మండిపడ్డారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వరప్రసాద్ మాట్లాడుతూ...ఇన్నేళ్ల నుండి కరెంటు లేక, అంధకారంలో ఉంటున్న తండవాసుల అవస్థలను పరిశీలించామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని  హామీ ఇచ్చామని తెలిపారు.