పెద్దగట్టు జాతరకు సూర్యాపేట డిపో నుండి 60 ప్రత్యేక బస్సులు
calendar_today
February 15, 2025
person
meenewstelugu
పెద్దగట్టు జాతరకు సూర్యాపేట డిపో నుండి 60 ప్రత్యేక బస్సులు
⏩:టీజీఎస్ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 14:: తెలంగాణ రాష్ట్రంలో రెండేండ్లకు ఒకసారి జరిగే రెండవ అతిపెద్ద జాతరైన దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి వారి జాతరకు భక్తుల సౌకర్యార్థం సూర్యాపేట డిపో నుండి 60 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజినల్ మేనేజర్ కె.జానిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దురాజ్ పల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 16న తెల్లవారుజామున ప్రారంభమై ఈ నెల 20 వరకు జాతర కొనసాగనుందని తెలిపారు.లింగమంతుల స్వామి వారి జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు.సూర్యాపేట నుండి పెద్దగట్టు జాతరకు బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.20 అని తెలిపారు.జాతరకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి భక్తులను సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు.ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖవంతమని అన్నారు.