సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు
మోతే మీ న్యూస్ ప్రతినిధి::మోతే: ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి ఈ ప్రాంత రైతుల పంట పొలాలను కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు అన్నారు. గురువారం మోతే మండల పరిధిలోని మామిళ్లగూడెం గ్రామంలో నిర్వహించిన సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సారెస్పీ కాలువ పరిధిలో వేలాది ఎకరాలు వరి నాట్లు వేశారని అన్నారు. నాట్లు పూర్తి అయిన నాటినుండి ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీళ్లు రాకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని దీంతోపంట పొలాలు ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం ఎస్సారెస్పీ ద్వారా నీటిని విడుదల చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఎస్సారెస్పీ కాలువకు నీరు వదిలినప్పుడు కోదాడ నియోజకవర్గంలోని మోతే, నడిగూడెం, మునగాల మండలాలకు నీరు రావడం లేదన్నారు. ఎస్ ఆర్ ఎస్ పి కాలువచివరి భూములకు నీరు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు గుంట గాని ఏసు అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు కక్కిరేణి సత్యనారాయణ, కిన్నెర పోతయ్య, కాంపాటి శ్రీను, బూడిద లింగయ్య, నాగం మల్లయ్య, బానోతు లచ్చిరాం, చర్లపల్లి మల్లయ్య, సోమ గాని మల్లయ్య, దోసపాటి శ్రీను, కొండ భాస్కర్, షేక్ జహీనాభి, మండల ప్రజా సంఘాల నాయకులు వెలుగు మధు, ములుకూరి మణెమ్మ, ఎర్రబోయిన మాల్సూర్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.