schedule Wednesday, June 17, 2026

జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఇమ్మడి సోమనర్సయ్యను నియమించాలి

calendar_today February 6, 2025
person meenewstelugu

జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఇమ్మడి సోమనర్సయ్యను నియమించాలి

డివిజన్ల వారీగా ముఖ్య పదవులను కేటాయించాలి

పలువురు ఆర్యవైశ్య ప్రముఖుల డిమాండ్

మీ న్యూస్ ప్రతినిధిసూర్యాపేట జిల్లా ఫిబ్రవరి 6:: సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఇమ్మడి సోమ నరసయ్యను నియమించాలని జిల్లా కేంద్రానికి చెందిన పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు అన్నారు.గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా కోదాడకు చెందిన వెంపటి వెంకటేశ్వరరావు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించామని తెలిపారు.అదే విధంగా సంఘంలో రెండో ముఖ్య పదవి అయిన ప్రధాన కార్యదర్శి పదవిని సూర్యాపేట డివిజన్ కి కేటాయించాలని కోరారు. వర్తక వ్యాపార పరంగానే కాకుండా అన్ని రకాలుగా ముఖ్య కేంద్రమైన జిల్లా కేంద్రంకు అనేక మంది బీద, పేద ఆర్యవైశ్యులు వచ్చి ఇక్కడి ప్రముఖుల సహాయ సహకారాలు పొందుతున్నారని తెలిపారు.జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ పట్టణంలో జరిగే అన్ని కార్యక్రమాలకు చేయూతనిచ్చి అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. పలు ముఖ్య విషయాలను పరిగణలోకి తీసుకొని ప్రధాన కార్యదర్శి పదవిని తాము కోరుకున్న విధంగా కేటాయించాలని అన్నారు.అన్ని వర్గాల వారికి సహాయ సహకారాలు అందిస్తున్న ఇమ్మడి సోమ నరసయ్యకు ప్రధాన కార్యదర్శి పదవిని కేటాయించడం సబబుగా తాము భావిస్తున్నట్లుగా తెలిపారు.తమ అభిప్రాయాలను గౌరవించి జిల్లాలో సంఘ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.సూర్యాపేట డివిజన్ కు ప్రధాన కార్యదర్శి పదవిని కేటాయించకపోతే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు సింగిరికొండ రవీందర్, తోట శ్యాంప్రసాద్, తాటికొండ సీతయ్య, మీలా వంశీ, మంచాల రంగయ్య, కలకోట లక్ష్మయ్య, దేవరశెట్టి సత్యనారాయణ, పబ్బతి వేణుమాధవ్, వెంపటి పురుషోత్తం, రాచకొండ శ్రీనివాస్, వెంపటి శబరినాథ్, బిక్కు మల్ల కృష్ణ, గుండా శ్రీధర్, బెలిదేశ్రీనివాస్, వంగవీటి రమేష్, గుడుగుంట్ల విద్యాసాగర్ చల్లా లక్ష్మయ్య, వెంపటి రవితేజ, చింత వెంకన్న, మంచాల శ్రీనివాస్, మిట్టపల్లి రమేష్, శ్రీరంగం రాము, భాను తేజ, తప్సి అనిల్ కుమార్, బచ్చు పురుషోత్తం, పెనుగొండ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.