పెన్ పహాడ్ మీ న్యూస్ ప్రతినిధి జనవరి 27:::పెన్ పహాడ్ మండలంలో వివిధ గ్రామాలలో ఎరువుల దుకాణాలలో యూరియా కొరత ఏర్పడిందని అనంతారం గ్రామానికి చెందిన జింకల నాగార్జున రైతు తమ ఆవేదనను వెలిబుచ్చినారు. సోమవారం మండల పరిధిలోని అనంతారం పిఎసిఎస్ ఆఫీసు ముందు మాట్లాడుతూ యూరియా కొరకు ఉదయం ఎనిమిది గంటల నుండి రైతులు భారీగా వరుసలో నిలబడినారని కొంతమంది రైతులు పాదరక్షాలను లైన్ లో పెట్టి వెళ్లినారని పిఎసిఎస్ అనంతారం అధికారులు సమయపాలన పాటించకపోవడంతో ఉదయం 11: 20కు పిఎసిఎస్ ఆఫీసు తెరవడంతో భారీగా రైతులు భారీగా గుమ్మిగూడినారు అని ఆయన తెలిపినారు. ఇప్పటికైనా మండల వ్యవసాయ అధికారులు మండలంలో యూరియా కొరత లేకుండా చూడాలని ఆయన వ్యవసాయ అధికారులను కోరినారు. మండల పరిధిలోని మాచారం గ్రామంలో బోలక సౌడయ్య అనే రైతు సూర్యాపేటలో వరి విత్తనాలు కొనుగోలు చేసి 30 రోజుల నారు నాటు వేసిన తర్వాత 30 రోజులలో వరి పొలం ఈని మొత్తం 60 రోజులలో వరి పొలం సన్నని ఎన్నుతో నిలబడిపోయినదని మండల వ్యవసాయ అధికారులకు తెలిపిన ప్రయోజనం లేదని బోలక సౌడయ్య తమ ఆవేదనను వెలిబుచ్చినారు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు తమ గోడును పట్టించుకుని న్యాయం చేయాలని మండల వ్యవసాయ అధికారులను కోరుతున్నాడు ఈ కార్యక్రమంలో రైతులు మామిడి సైదులు, మామిడి శ్రీనివాసు, బైరెడ్డి ఉపేందర్ రెడ్డి, మామిడి బిక్షం, ఎర్ర సత్యం, మేకల శ్రీను అన్నారం, నాగులపాడు, దోసపాడు, పొట్లపాడు, నారాయణ గూడెం, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.