schedule Wednesday, June 17, 2026

తులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం.

calendar_today January 28, 2025
person meenewstelugu

రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం.

నల్లగొండ రైతు ధర్నా సభకు తరలి వెళ్లిన సర్వారం బిఆర్ఎస్ శ్రేణులు

 

సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి 28

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పల్సు మాల్సూర్ అన్నారు. మంగళవారం సర్వారం నుండి నల్లగొండలో జరిగే రైతు మహాధర్నా కు తరలి వెళ్ళినారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ పాలన సాగిస్తుందని మండిపడ్డారు. రైతు భరోసా ఎకరానికి 15000, ఇస్తానని చెప్పి కేవలం 12 వేలకే పరిమితమైందని కౌలు రైతులను గుర్తించకపోవడం దారుణం అన్నారు . రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా టిఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన రైతు మహా ధర్నా కు ప్రజలంతా మద్దతిస్తున్నారని తెలిపారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు మిక్కిలినేని సతీష్, గ్రామ ప్రధాన కార్యదర్శి వడ్డె వీరయ్య, గ్రామ నాయకులు చల్లమర్ల శ్రీధర్, ఉప్పుల మల్లయ్య, ఉప్పుల చౌడయ్య, పాల్గొన్నారు.