schedule Wednesday, June 17, 2026

calendar_today January 15, 2025
person meenewstelugu
విస్తృతంగా వాహనాల తనిఖీలు

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జనవరి 14:::: కారు నడిపేటపుడు డ్రైవర్లు తప్పక సీటు బెల్టు ధరించాలనీ సూర్యాపేట పట్టణ ఎస్సై సాయిరాం సూచించారు. మంగళవారం సూర్యాపేటలోని ఈనాడు ఆఫీస్ జంక్షన్ వద్ద రోడ్డు భద్రత మసోత్సవల్లో భాగంగా విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించి మాట్లాడారు.కారు డ్రైవర్లు విధిగా లైసెన్స్‌ కలిగి ఉండటమే కాకుండా సంబంధిత పత్రాలను ఎల్లవేళలా కలిగి ఉండాలనీ తెలిపారు. అతి వేగంతో నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి ప్రాణానికి ముప్పు తెచ్చుకోవద్దని హితవు పలికారు. సురక్షిత ప్రయాణానికి ప్రభుత్వం నిత్యం అనేక సూచనలు చేస్తుందనీ, వాటిని విధిగా ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు.మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనవెంట పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.