schedule Friday, June 19, 2026

కార్మికుల న్యాయమైన హక్కులకు యాజమాన్యం సహకరించాలి 

calendar_today January 10, 2025
person meenewstelugu

కార్మికుల న్యాయమైన హక్కులకు యాజమాన్యం సహకరించాలి 

 బీసీ నేత ధనుంజయ నాయుడు విజ్ఞప్తి.

 మీ న్యూస్. జనవరి 09/సూర్యాపేట జిల్లా ప్రతినిధి :::: సూర్యాపేట సమీపంలోని ఇమాంపేట గ్రామం వద్దగల హెచ్పీసీఎల్ ఆయిల్ ట్యాంకర్ కార్మికుల చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించిన అనంతరం బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేయాల్సి ఉన్నప్పటికీ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి వల్ల మూడు సంవత్సరాలు దాటినా ఇంతవరకు వేతన చేయకపోవడం శోచనీయమని అన్నారు. పెరుగుతున్ననిత్య జీవిత అవసర వస్తువుల ధరలు గమనంలో ఉంచుకొని తక్షణమే కార్మికులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.కార్మికులకు జీవిత భద్రత లేకపోయినప్పటికీ నమ్ముకున్న వృత్తిలోనే జీవిస్తూ ఏఐటియుసి నాయకత్వాన పనిచేస్తూ. తమ న్యాయమైన కోర్కెల కొరకు గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నారని, ఎందుకు యాజమాన్య వారు కటిక వైఖరితో ఉన్నారని, వారు అడిగేది గొంతెమ్మకోరికలు కావని వారి కోరికలు సాధించుకునే వరకు వారి హక్కుల సాధన కొరకు ఏఐటియూసితోపాటు బీసీ హక్కుల సాధన సమితి కూడా అడ్డంగా ఉంటుందని ఆయన ప్రకటించారు.సమ్మెకు మద్దతు ఇచ్చిన వారిలో సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు ఏఐటియుసి ప్రాంతీయ సహాయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్కొమర్రాజు వెంకట్, వల్లం కొండ హరిబాబు పరికె భరత్, హెచ్పిసిఎల్ అధ్యక్షుడు ఎండి బాబా కార్యదర్శి నాగరాజు రాచకొండ సాయి వెంకట్ నారాయణ రాములు ఉపేంద్ర ఉన్నారు.