మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి 09 :::డిసెంబర్ 31వ తేదీన జరిగిన హత్య కేసును చివ్వెంల పోలీసులు చేదించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీ రవి వివరాలు వెల్లడించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. వారి వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్స్, మూడు ద్విచక్ర వాహనాలు, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీఐ రాజశేఖర్, ఎస్ఐ మహేష్ , పోలీస్ సిబ్బంది ఉన్నారు.