schedule Wednesday, June 17, 2026

ప్రమాదాల నివారణపై ఐఓసీఎల్‌ మాక్‌ డ్రిల్‌

calendar_today January 8, 2025
person meenewstelugu

ప్రమాదాల నివారణపై ఐఓసీఎల్‌ మాక్‌ డ్రిల్‌

 

మీ న్యూస్ ప్రతినిధి :::సూర్యాపేట (రూరల్‌): ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిధిలోని కాసరబాద సమీపంలో ప్రమాదాల నివారణపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డీఎస్పీ రవి, జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డిలు హాజరై మాక్‌ డ్రిల్‌ను పరిశీలించి మాట్లాడారు. ఆయిల్‌ పైప్‌ లైన్‌లు వెళ్లే గ్రామాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిబ్బంది ప్రయోగాత్మకంగా వివరించారు. ప్రతి సంవత్సరం ఆయిల్‌ పైప్‌లైన్‌ వెళ్లే గ్రామాల ప్రజలకు, సిబ్బందికి అవగాహన కల్పించడం అవసరమన్నారు. ఐఓసీఎల్‌ ఇంచార్జ్‌ గోపాలకృష్ణ మూర్తి కూన మాట్లాడుతూ పారాదీప్‌-హైద్రాబాద్‌ పైప్‌లైన్‌ పరిధిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సజాగ్‌ ప్రహారీ ప్రోత్సాహక పథకంపై వివరించారు. పైప్‌ లైన్‌ దొంగతనాలు, ఇతర నేర కార్యకలాపాలను నివారిం చేందుకు కృషి చేసిన సిబ్బందికి రివార్డులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ శ్రీదేవి, ఐఓసీఎల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.