ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా - అజయ్ కుమార్ నియామకం
calendar_today
December 28, 2024
person
meenewstelugu
ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా - అజయ్ కుమార్ నియామకం
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 28 :::: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సిద్దిపేట్ లో జరిగిన 43 వ రాష్ట్ర మహాసభలలో తాండూర్ పట్టణంకి చెందిన అజయ్ కుమార్ ను ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది.అజయ్ కుమార్ గతంలో ఏబీవీపీ కళాశాల కార్యదర్శిగా నగర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.అజయ్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు అప్పగించిన ఏబీవీపీ రాష్ట్ర శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని తాండూర్ లో ఏబీవీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానాని తెలిపారు. అజయ్ కుమార్ కు ఏబీవీపీ కార్యకర్తలు స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు