పెద్దగట్టు జాతరకు గుడి వద్ద శాశ్వత నిర్మాణం చేస్తాం
calendar_today
December 27, 2024
person
meenewstelugu
పెద్దగట్టు జాతరకు గుడి వద్ద శాశ్వత నిర్మాణం చేస్తాం
సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జాతరకు 10 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయమని కోరడం జరిగింది.
త్వరలోనే గుట్ట చైర్మన్ నియామకం చేస్తాం
గతంలో హడావుడిగా పనులు చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకుల నిధులు స్వాహా చేశారు
టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా చివ్వెం మండలం దురాజ్పల్లి గ్రామంలో వెలిసినతెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన దురాజ్పల్లి పెద్దగట్టు జాతర ప్రభుత్వపరంగా అన్ని రకాల ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు పెద్దగట్టు ఆలయానికి చైర్మన్ త్వరలోనే నియమిస్తామని చెప్పారు ఫిబ్రవరి నెల 16వ తేదీ నుండి 20 వవరకు జరిగే లింగ బంత్ర స్వామి జాతరకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన పెద్దగట్టు ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గుట్టపై అనంతరం గుట్టపై పరిసరాలలో జాతర సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇప్పటికే జాతర జరగాలని సందర్శించారని పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ తాను గుట్ట అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి 10 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు ఇప్పటికే జాతరకు చేయవలసిన ఏర్పాట్లపై జిల్లా మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడినట్లు చెప్పారు గతంలో టిఆర్ఎస్ పాలనలో గుట్ట వద్ద జాతర సమయంలో నిధులు మంజూరు చేసి హడావుడిగా కొన్ని పనులు చేసి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ నిధులు సహజ చేశారని అన్నారు గుట్టపైకి వాహనాలు వెళ్లడానికి రోడ్డు నిర్మాణం చేస్తామని తెలిపారు తాము గుట్ట వద్ద శాశ్వత నిర్మాణాలు చేస్తామని తెలిపారు గుట్టపైన భక్తులు రాత్రిపూట నిద్ర చేయడానికి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని చెప్పారు దేవాలయం పైన పూజలు నివాసం ఉండేలా రెసిడెన్షియల్ కోటర్స్ నిర్మాణం చేస్తామని భక్తులకు మరుగుదొడ్లు స్థానపు గదులు నిర్మాణం చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ కౌన్సిలర్ షఫీ ఉల్లా ముదిరెడ్డి రమణారెడ్డి జ్యోతి కరుణాకర్ గట్టు శ్రీనివాస్ ఫరూక్ రమేష్ నాయుడు ధర్మనాయక్ బైరబోయిన శ్రీనివాస్ సైదిరెడ్డి వల్దాస్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు