schedule Friday, June 19, 2026

రాయిపాడు గ్రామంలో నిర్మించే ఇథనాల్ కంపెనీ పర్మిషన్ రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం

calendar_today December 14, 2024
person meenewstelugu

రాయిపాడు గ్రామంలో నిర్మించే ఇథనాల్ కంపెనీ పర్మిషన్ రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 13

రాయిపాడు గ్రామంలో నిర్మించే ఇథనాల్ కంపెనీ పర్మిషన్ రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం

మండలంలోని రాయపాడు గ్రామంలో నిర్మించే ఇథనాల్ కంపెనీ పర్మిషన్ రద్దు చేయాలని *సూర్యాపేట జిల్లా కలెక్టర్ కి NMK వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది . అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్,సిపిఐ సినియర్ నాయకులు దంతల రాంబాబు, mcpiu రాష్ట్ర నాయకులు వరికుప్పల వెంకన్న, cpusi rm చామకూరి నర్సయ్య, దళిత మహాసభ రాష్ట్ర నాయకుడు వెంకట్ యాదవ్, సిపిఐ ఎం ఎల్ రాంచంద్రన్ బాలస్వామి మాట్లాడుతూ విత్తనాలు కంపెనీ వలన నీరు గాలి కలుషితం అయ్యే పరిస్థితి ఉన్నది అలాగే ఆహార ఉత్పత్తుల కొరత కూడా ఏర్పరుచున్నది. కలుషితమైన నీటి మూలంగా పంట పొలాలు దెబ్బ తినడమే కాకుండా , ప్రజలు అనారోగ్యం బారిన పడతారు. అమెరికాలో కూడా ఈ ఫ్యాక్టరీల వలన ప్రజలకు అనేక నష్టాలు జరిగినట్లు ఆ దేశ వార్షిక నివేదికలో వివరించాయి. మన రాష్ట్రంలో నిర్మల్ జిల్లా దిలావత్ పూర్ లో నిర్మించే ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజల ఆందోళనతో ప్రభుత్వం రద్దు చేసింది చిత్తనూర్ లో నడుస్తున్న ఫ్యాక్టరీ వలన అనేక నష్టాలు జరుగుచున్నవి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం పోచి ఉన్నది కాబట్టి రైతులు ప్రజలకు నష్టం జరిగే రాయపాడులో నిర్మించే NMK ఇథనాల్ కంపెనీ పర్మిషన్ రద్దుచేసి ప్రజలను రైతులను కాపాడాలని కోరుచున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో IFTU జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు,PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్, AIkms జిల్లా సహాయ కార్యదర్శి అలుగుబెల్లి వెంకట్ రెడ్డి,పోరడ్ల దశరధ, బొల్లె వెంకన్న, mcpiu జిల్లా కార్యదర్శి నజీర్, pdsu డివిజన్ కార్యదర్శి భరత్ తదితరులు పాల్గొన్నారు.