ఎన్ఎంకే ఇతనాల్ కంపెనీకి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా
calendar_today
December 13, 2024
person
meenewstelugu
ఎన్ఎంకే ఇతనాల్ కంపెనీకి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబరు 12:::
రాయపహాడ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఎన్ఎంకే ఇతనాల్ కంపెనీకి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కంపెనీ వల్ల గ్రామానికి కలిగే పర్యావరణ, ఆరోగ్య సమస్యల గురించి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం నాయకులు మరియు గ్రామస్థులు కలిసి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ముల్కూరి గోపాల్ రెడ్డి గ్రామ కార్యదర్శి ఎర్రబోయిన మల్సూరు మండల కమిటీ సభ్యులు కంపటి శ్రీను సోమ గాని మల్లయ్య మండల అధ్యక్షులు వెలుగు మధు చేగువేరా నాయకులు శీలం సతీష్ కొప్పు ఎంకన్న ములకలపల్లి మల్సూరు కోడి లింగయ్య వీరమల్లు తదితరులు పాల్గొన్నారు.