schedule Wednesday, June 17, 2026

గడ్డిమోపులు దగ్ధం..

calendar_today December 8, 2024
person meenewstelugu

గడ్డిమోపులు దగ్ధం..

 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 7  ::: సూర్యాపేట జిల్లా మోతె మండలంగుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో 80 గడ్డిమోపులు దగ్ధమైన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసు కుంది. అయిత బోయిన జగ్గయ్య తాసిల్దార్ కార్యాలయం వెనకాల బండపై పశువుల కోసమని పశుగ్రాసం ఉంచగా, గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పూర్తిగా గడ్డివాము దగ్ధమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఇంకా కొన్ని గడ్డివాములు ఉన్నా యని వాటికి నిప్పు అంటుకోకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.