schedule Friday, June 19, 2026

బీజేపీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్దంతి

calendar_today December 6, 2024
person meenewstelugu

బీజేపీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్దంతి

 

 మీ న్యూస్   ప్రతినిధి డిసెంబర్ 6 :: స్థానిక న్యాల్ కల్ మండలం లోని హద్నూర్ లోని అంబేద్కర్ విగ్రనికి పూలమాల వేసి డా" బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా బీజేపీ మండలం అధ్యక్షులు ఓంకార్ యాదవ్ మాట్లాడుతూ స్వతంత్ర సమారాయొద్ధుడు భారత రాజ్యాంగ రచయిత భారతా రత్న డాక్టర్ అంబేడ్కర్ గారికి ముందుగా నివాళులు అర్పించి భరత రాజ్యం గన్ని భరతమంతా భుజస్కందాలపై మోశారు. కమిటీలోని ఏడుగురు సభ్యుల్లో ఒకరు చనిపోగా.. మిగతా ఐదుగురు వారి అడుగు జాడల్లో ఉంటూ అంబేడ్కర్ గారు ఈ బాధ్యతలు నిర్వర్తించారు. భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రిగా ఇలా అంబేడ్కర్ గురించి ఎంత చెప్పుకునా తక్కువేననడంలో అతిశయోక్తి లేదు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో శ్రమించార రాజ్యాంగకర్తగా విశేష సేవలందించిన బాబాసాహెబ్.గారు ఆర్ధిక, న్యాయశాస్త్రంలో ప్రముఖ వర్సిటీల్లో పీహెచ్‌డీ.జీవిత చరమాంకంలో బౌద్ధమతం స్వీకరించిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ డిసెంబరు 6, 1956లో కన్నుమూశారు దేశంలోని అణగారిన వర్గాల ఆర్ధిక, సామాజిక సాధికారికతకు అంబేడ్కర్ గారు చివరి వరకు పోరాటం చేశారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యునిగా అంబేడ్కర్ విశేష శ్రమకోర్చి రాజ్యాంగ రచన చేయడం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, జాతీయోద్యంలో దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, మానవశాస్త్ర అధ్యయనకర్త, చరిత్రకారుడు రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త ఇలా అంబేడ్కర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురయి.. పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి బాబాసాహెబ్ అంబేడ్కర్ తన జీవితకాలం అణగారిన వర్గాల గొంతుకను వినిపించి, వారి సాధికారికతకు పాటుపడ్డారు కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి అర్ధశాస్త్రంలో గౌరవ డాక్టరేటు సంపాదించి అలాగే, ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల్లో న్యాయ, ఆర్ధిక, రాజకీయ శాస్త్రాల్లో పరిశోధనలు చేశారు విద్యాభ్యాసం తర్వాత ఆర్ధికవేత్తగా, ప్రొఫెసర్‌గా, న్యాయవాదిగా ఉన్నారు. తరువాత జాతీయోద్యమంలో భాగస్వామ్యమయ్యారు. స్వాతంత్రం తర్వాత దళితుల రాజకీయ హక్కులు, సామాజిక స్వేచ్ఛ కోసం పనిచేశారు రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా సేవలందించి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం తయారీలో కీలక పాత్ర పోషించారు. అలాగే, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్థాపనలో అంబేడ్కర్ పాత్ర ఉంది. హిల్టన్ యంగ్ కమిటీకి అందించిన భావనతో కేంద్ర బ్యాంకు ఏర్పాటయ్యింది. జీవితాంతం అణగారి వర్గాల కోసం పోరాడి, వారికి ఆశాజ్యోతిగా నిలిచారు. తన జీవిత చరమాంకంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. గౌతమ బుద్దుని బోధనలకు ప్రభావితమైన అంబేడ్కర్.. బౌద్ధుడిగా మారరు అని వారు అన్నారు ఈ కార్యక్రమం లో బీజేపీ మండలం ప్రధాన కార్యదర్శి మల్లేష్ గంగ్వర్ వీరా రెడ్డి వీరన్న పటేల్ సంతోష్ రెడ్డి శామ్ చిలుక మల్లెశం గ్రామ పెద్దలు ఉన్నారు మీ 31 న్యూస్ ప్రతినిధి కె అశోక్ జహీరాబాద్ ఇంచార్జీ