వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్న నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలను రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేయాలని పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా మీ న్యూస్ ప్రతినిధి::: కేద్రంలోని 60 ఫిట్స్ రోడ్డున ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా పి డి ఎస్ యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పుల్లూరి సింహాద్రి, ఎం.చందర్రావు మాట్లాడుతూ వరుసగా రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలలో విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కనీస సౌకర్యాలు లేకుండా నడుపుతున్నారని,ర్యాంకుల కోసం, మార్కుల కోసం ధనార్జన ధ్యేయంగా విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని , ప్రతి సంవత్సరం వందల మంది చనిపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థలను రద్దు చేయాలని, అలాగే రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సంబంధించినటువంటి హాస్టల్స్ లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు వేసి నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని,పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ లు తక్షణమే విడుదల చేయాలని అన్నారు.చనిపోయినటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని, విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు డివిజన్ ప్రధాన కార్యదర్శి, పిడమర్తి భరత్, నాయకులు సంధ్య మానస, స్వప్న, నందిని, వర్షిత, మహేష్, పవన్, వినయ్, సాయి , వేణు తదితరులు పాల్గొన్నారు.