కోహీర్ మండల వనరులు కేంద్రము కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన
calendar_today
December 3, 2024
person
meenewstelugu
కోహీర్ మండల వనరులు కేంద్రము కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మండల కేంద్రమైన కోహీర్ ఏం ఇ ఓ కార్యాలయం వద్ద . సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించరు వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం మమ్మల్ని తక్షణమే రెగ్యులర్ చెయ్యాలని, లేనియెడల మినిమం టైం స్కేల్ ఇవ్వాలని, ప్రభుత్వ నియామకాల్లో వేయిటెజీ కల్పించాలని, మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరి చెయ్యాలని మరియు మరణించిన ఉద్యోగులకు ఎక్సగ్రేషయా ప్రటించాలని డిమాండ్ చేసారు. లేని యెడల త్వరలో నిరవధిక సమ్మె మొగిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో MRC సిబ్బంది స్వరాజ్ కుమార్, భాను శ్రీ లు, మరియు CRP లు రాజు, మోహన్, యాదయ్య మరియు కిషన్ సింగ్ లు పాల్గొన్నారు.మీ 31న్యూస్ ప్రతినిధి కె అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్