మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 2:::సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం లోని న్యాల్కల్ మండల కేంద్రంలోని పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రగతిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు గారి ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి పర్యవేక్షణలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై తెలంగాణ సాంస్కృతిక సారథి సంగారెడ్డి జిల్లా కళాకారులు ఆట మాట పాటల ద్వారా పాటలు పాడి ప్రజలను ఉత్తేజపరిచారు.
న్యాల్కల్ మండల కేంద్రంతోపాటు హద్నూర్, గంగ్వార్ గ్రామాలలో పెద్ద ఎత్తున కళాయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తమ పాటల ద్వారా ప్రజలకు వివరించారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీల అమలు యొక్క అభివృద్ధి పథాన్ని వివరించడం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం, ఐదు వందలకే గ్యాస్ సిలిండర్, రైతులకు రుణమాఫీ, యువ వికాసం, ఉద్యోగ నియామకాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షలకు పెంపు, మహిళలకు వడ్డీలేని రుణాలు, స్కిల్ యూనివర్సిటీ వంటి తదితర పథకాలకు సంబంధించి పాటలు ఆలపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసిందని వివరించారు. కళాకారుల ఆటపాటలు ప్రజల్ని ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో న్యాల్కల్ మండల ఎంపీడీఓ రాజశేఖర్ కార్యదర్శి ధన్ రాజ్, ప్రజాప్రతినిధులు సొసైటీ ఛైర్మన్ సిద్ది లింగయ్య స్వామి అలాగే గంగ్వార్ నాయకులు బలరాం రెడ్డి, మాజీ ఎంపిపి రత్నం, జీవన్ రెడ్డి, విఠల్, చంద్రప్ప, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ కళాయాత్రలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు జిల్లా టీమ్ లీడర్ ఆయిదాల సునీల్, డి రమేష్, ఎన్ దుర్గేష్, ఎస్ మల్లేష్, పి సంధ్య, ఈ వినేష్, బి నవీన్ మరియు జి శంకర్ పాల్గొని కళా ప్రదర్శన నిర్వహించారు.మీ 31న్యూస్ ప్రతినిధి కె అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్