schedule Wednesday, June 17, 2026

calendar_today April 20, 2024
person meenewstelugu

MP రంజిత్ రెడ్డి పై అలిగిన కాంగ్రెస్ కార్యకర్తలు -పార్టీ ప్రచారానికి దూరం -ఇలాగైతే గెలుపు కష్టమా..?

దీక్షతెలుగు, న్యూస్ :

వచ్చేనెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల ప్రచార శనివారం రోజు ప్రారంభమైంది. అందులో భాగంగా ఎల్మకన్య గ్రామంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమానికి కార్యకర్తలు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గెలుపు కోసం ఎంతో కష్టపడ్డరు ప్రచార కార్యక్రమానికి దూరంగా ఉన్నారు గ్రామానికి చెందిన కార్యకర్తలు వెంకట్ రెడ్డి, శివరాజ్, చంద్రప్ప, బాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, జర్నప్ప, వెంకటప్ప, రాములు, నర్సిములు, తదితరులు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రచార కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు కనిపించింది. పార్టీ కోసం ఎంతో కష్టపడినా మాకు గుర్తింపు లేకపోవడంతోనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై అలిగినట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఎన్నికల బీసీ లో ఉండడంతో ప్రతి కార్యకర్త ఎంతో ముఖ్యమనే సంకేతాలు సైతం ఉన్నప్పటికీ ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదని పలువురు పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.