schedule Friday, June 19, 2026

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ

calendar_today November 19, 2024
person meenewstelugu

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ

 

మీ న్యూస్ ప్రతినిధి ::

భారతదేశ ప్రధానమంత్రి గా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన ఇందిరాగాంధీ ఉగ్రవాదుల తూటాలకు బలయిపోయి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకురాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ ఆలి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు. మాజీ ప్రధాని ఇ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమం లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ పేదల సంక్షేమం కోసం ఇరవై సూత్రాల పధకం అమలు చేశారని, భూ సంస్కరణల ద్వారా జమీందారుల భూములను పేదలకు పంచారని అన్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణం చేశారని, గరిబి హఠావో అంటూ పేదల సంక్షేమం కోసం పనిచేశారని అన్నారు. జాతీయ సమైక్యత కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టారని, ప్రజలకు ఐకమత్యంతో జీవించాలనే సందేశాన్ని రాహుల్ గాంధీ అందించారని అన్నారు. దేశంలో మతపరమైన విభజన చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపి పట్ల ప్రజలు జాగ్రత్తగా వుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరన్న నాయక్, అబ్దుల్ రహీం, తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కొండపల్లి దిలీప్ రెడ్డి , సిరివెళ్ల శభరినాధ్, గండూరి రమేష్, నాగుల వాసు,రుద్రంగి రవి, గడ్డం వెంకన్న, అన్నమయ్య రాము, ఆలేటి మాణిక్యం, రావుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.