schedule Wednesday, June 17, 2026

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు 

calendar_today November 15, 2024
person meenewstelugu

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు 

 

-వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి 

" తాండూర్ రూరల్ నవంబర్ 14,: మీ న్యూస్ ప్రతినిధి:- వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ శివారులోని కాగ్నా నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తాండూర్ రూరల్ సిఐ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇట్టి ట్రాక్టర్లకు సంబంధించిన పత్రాలు ఉన్నప్పటికీ ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న్నన అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ నెంబర్ TS 34 ETR 4467.TS 34GP 6486 గల ట్రాక్టర్ కూడా పిఎస్ కు తీసుకురావడం జరిగినది ట్రాక్టర్ యజమాని ఎవరని విచారించగా బెన్నూర్ గ్రామానికి చెందిన మహ్మద్ అహ్మద్అని తేలినది ఇట్టి రెండు ట్రాక్టర్లను ఎలాంటి అనుమతి పత్రాలు చూపించకపోవడంతో పాటు ప్రభుత్వం ద్వారా ఇసుక రవాణా అనుమతులు పొందకుండానే అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామని సిఐ చెప్పారు. ఇట్టి ట్రాక్టర్లను తహసీల్దార్ కు అప్పగించినట్లు చెప్పారు. ఇసుక రవాణా కోసం అనుమతులు తప్పనిసరి ఉండాలని సిఐ సూచించారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు.