schedule Friday, June 19, 2026

సియం సహాయ నిధి చేక్కులు పంపిణీ 

calendar_today November 14, 2024
person meenewstelugu

సియం సహాయ నిధి చేక్కులు పంపిణీ 

మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ ఆదేశాలతో సియం సహాయ నిధి చేక్కులు పంపిణీ చేసిన

మీ న్యూస్ ప్రతినిధి :::

జహిరాబాద్ టౌన్: జహిరాబాద్ నియోజకవర్గం లోని వివిధ గ్రామాల బాధితులకు మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ సిఫార్సు తో మంజూరు అయిన చెక్కులను క్యాంపు కార్యాలయంలో భాదితులుకు అయా మండాలల అద్యక్షులు అందచేసారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కృషితో అవసరమైన సమయంలో అనేక కుటుంబాలకు ఆసరాగా సియం సహాయ నిధి నిలిస్తున్నదని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు నర్సింహులు.పి,రేహనబేగం,వందన మాణిక్,జగదీశ్వరీ,దేవాయ్య , రమాదేవి గార్లకు మూడు లక్షల మూఫ్ఫై వేల రూపాయలు (330,000-/) విలువ గల చేక్కలు అందించారు ఈ సందర్భంగా వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తు తమకు ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి , మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి.మక్సుద్ .రామలింగారెడ్డి. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్