schedule Friday, June 19, 2026

మహాసభలు జయప్రదం చేయండి

calendar_today November 12, 2024
person meenewstelugu

మహాసభలు జయప్రదం చేయండి.

 సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం జిల్లాతృతీయ మహాసభలు 

 

నవంబర్ 29, 30, డిసెంబర్ 1 లో

 

జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం జిల్లాతృతీయ మహాసభలు 

సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

మీ న్యూస్ ప్రతినిధి :+

 సూర్యాపేట: మహత్తరమైన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ సూర్యాపేట జిల్లా కేంద్రంలోనవంబర్ 29,30, డిసెంబర్ 1 న జరిగే సిపిఎం పార్టీ జిల్లాతృతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహ రెడ్డి భవన్ లో సూర్యాపేటలో జరిగే సిపిఎం జిల్లా మహాసభల కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ నవంబర్ 29న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో వేలాది మందితో బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్, బీవీ రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శితమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మిలు హాజరవుతున్నారని తెలిపారు.నవంబర్30, డిసెంబర్ 1 తేదీల లో 500 మంది ప్రతినిధులతో సుమంగళి ఫంక్షన్ హాల్ లో మహాసభలు జరుగుతాయని చెప్పారు. ఈ మహాసభల విజయవంతానికై ప్రజలంతా హార్దికంగా,ఆర్థికంగా సహాయ సహకారాలుఅందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి,జిల్లా కమిటీ సభ్యులుబెల్లంకొండ వెంకటేశ్వర్లు, వేల్పుల వెంకన్న,వీరబోయిన రవి, చిన్నపంగా నరసయ్య,మద్దెల జ్యోతి, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, సిపిఎం సీనియర్ నాయకులు చెరుకు సత్యం తదితరులు పాల్గొన్నారు.