schedule Friday, June 19, 2026

రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు 

calendar_today November 8, 2024
person meenewstelugu

రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు 

మీ న్యూస్ ప్రతినిధి :::విశాఖకు... తాజ్ హోటల్! ‌ : సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా వరుసగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ‌మరోవైపు రాజధానితో పాటుగా మరో ముఖ్య నగరమైన విశాఖపై కూడా దృష్టి కేంద్రీకరించారు.ఇటీవలే విశాఖకు టీసీఎస్ కార్యాలయం రానుందని, దీంతో స్థానికంగా, ఆర్థికంగా విశాఖ మరింత అభివృద్ధి చెందుబోతుందంటూ మంత్రి నారా లోకేశ్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఆతిథ్య, సేవా రంగ సంస్థ అయిన తాజ్‌ గ్రూప్‌ ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ హోటల్‌ను నిర్మించేందుకు ఆసక్తి చూపుతోంది.ఈ నేపథ్యంలో ఆ సంస్థ ప్రతినిధులు రెండు రోజులుగా విశాఖలో హోటల్ ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను పరిశీలన చేస్తున్నారు. బుధ, గురు వారాల్లో విశాఖలోని కొన్ని స్థలాలను పరిశీలించగా అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో మరికొన్నింటిని పర్యటించి గుర్తించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో తీరానికి సమీపంలో వంద ఎకరాలు కేటాయిస్తే భారీ హోటల్‌ నిర్మించేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయానికి సమీప ప్రాంతాల్లోనూ తాజా గ్రూప్స్ నుంచి వచ్చిన సిబ్బంది పరిశీలించారు. తాజ్‌ ప్రతినిధులకు పర్యాటక, రెవెన్యూశాఖ అధికారులు ఆయా భూములను చూపించారు.తాజ్ గ్రూప్స్ విశాఖకు వస్తే స్థానికంగా ఉండేవారికి ఆదాయం పెరగడంతో పాటుగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా భారీగా వస్తాయి. హోటల్ ఏర్పాటు చేసే ప్రాంతం బీచ్‌కి దగ్గరగా ఉన్నందున పర్యాటకులకు ఆహ్లాదం కల్పిస్తుంది . ఈ కార్యక్రమములో పర్యాటక అధికారి gyanaveni. సిబ్బంది పాల్గొన్నారు..