schedule Friday, June 19, 2026

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.

calendar_today November 8, 2024
person meenewstelugu

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.

రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలి.

 రైతు భరోసానిధులు వెంటనే విడుదల చేయాలి.

 సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

 మీ న్యూస్ ప్రతినిధి :::నడిగూడెం: ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలోని కొల్లు కోటయ్య ఫంక్షన్ హాల్ లో జరిగిన సిపిఎం పార్టీ నడిగూడెం మండలం 8వ మహాసభకు సిపిఎం మండల కమిటీ సభ్యలు కోరుట్ల శ్రీను, పసుపులేటి నాగమణి అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ఐకెపి కేంద్రాలను ప్రారంభించారు తప్ప నేటికీ కొనుగోలు ప్రారంభం కాకపోవటం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్దలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తూ పేదలను విస్మరిస్తున్నారని వారు విమర్శించారు. దేశంలోని మతోన్మాద శక్తులు బిజెపి దాని అనుబంధ సంఘాలు అధికారంలో ఉండటం వల్ల మైనార్టీ మతాలపై రోజురోజుకు తీవ్రమైన దాడులు పెరుగుతున్నాయని అన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన ఆర్థిక విధానాలను అమలు చేస్తూ దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని వారు విమర్శించారు. రాష్ట్రంలో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని అన్నారు.అత్యంత నిరుపేదలైన వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయల ఇస్తామని, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని, విద్యా, ఉద్యోగ నియమకాలను పూర్తి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని వారు ఆరోపించారు. రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మాటలకే పరిమితమైంది 30 శాతం మంది రైతుల కంటే ఎక్కువ రైతులకు రుణాలు మాఫీ చేయలేదుఅన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలని,గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులకు గురవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం తక్షణమే స్పందించి పట్టణాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని వారు డిమాండ్ చేశారు ఈ మహాసభ ప్రారంభ సూచికంగా సిపిఎం పార్టీ పతాకాన్ని సిపిఎం సీనియర్ నాయకురాలు బెల్లంకొండ రామస్వామి ఆవిష్కరించారు,ఈ సందర్భంగా నడిగూడెం మండలంలో ఈ మూడు సంవత్సరాల కాలంలోసిపిఎం పార్టీ నిర్వహించిన ప్రజా పోరాటాలనివేదికను సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ ప్రవేశపెట్టారు. అంతకుముందు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మల్లు స్వరాజ్యం, బుద్ధదేవ్ భట్టాచార్య, పెన్నా అనంతరామ శర్మ లకు ఈ మహాసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మహాసభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మట్టి పెళ్లి సైదులు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండ వెంకటరెడ్డి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు,జిల్లా పెళ్లి నరసింహారావు,సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ, మండల కమిటీ సభ్యులు ఏనుగుల వీరాంజనేయులు, షేక్ సైదా హుస్సేన్, షేక్ బాబు, కాసాని కిషోర్,బెల్లంకొండ హనుమయ్య,హనీపూ, మల్లెల వెంకన్న, పసుపులేటి వెంకటేశ్వర్లు, వీరబోయిన సైదులు, షేక్ మస్తాన్, రామిరెడ్డి,తిరుపతయ్య,ఎల్లయ్యతదితరులు పాల్గొన్నారు.