మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ శ్రేణులు
calendar_today
November 7, 2024
person
meenewstelugu
మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ శ్రేణులు
మీ న్యూస్ ప్రతినిధి:::మోతె మండల కేంద్రనికి చెందిన గురిజాల ఎల్లయ్య( 60)(మాజీ వార్డ్ నెంబర్ ) కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ గురిజాల ఎల్లయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు దాన సంస్కారాల కోసం ఒక కింట బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సామ వెంకటరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు బొక్క ఉపేందర్ రెడ్డి, బొల్లం నారాయణ, బొడ్డు సాలయ్య, అయిదుబోయిన వెంకన్న,దోసపాటి ఎల్లయ్య, గురజాల వెంకయ్య, గురజాల ఎల్లయ్య నిమ్మన గొంటి శ్రీకాంత్, అండ్ గోపి, దోసపాటి వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.