schedule Wednesday, June 17, 2026

బీఆర్​ఎస్​ లో గుర్తింపు లేదు

calendar_today March 3, 2024
person meenewstelugu
బీఆర్​ఎస్​ లో గుర్తింపు లేదు

బీఆర్​ఎస్​ లో గుర్తింపు లేదు

-తాండూరు మండల బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్ -మండల ప్రచార కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గౌడ్ రాజీనామా -తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన ప్రవీణ్ కుమార్ గౌడ్

దీక్షతెలుగున్యూస్ ,తాండూరు:
బీఆర్ఎస్ పార్టీలో సరైన ప్రాధాన్యత, గుర్తింపు లేదని బీఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గౌడ్ అన్నారు.తాండూరు మండల బీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి వై ప్రవీణ్ కుమార్ గౌడ్ తన పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..ప్రస్తుతం పార్టీలో తగిన ప్రాధాన్యత లేక పోవడంతోనే పార్టీ పదవి నుండి తప్పుకుంటూ, పార్టీ సభ్యత్వం తో పాటు పదవికి రాజీనామా చేసి జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు మెతుకు ఆనందుకు టాక్స్ ద్వారా తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు పేర్కొన్నారు. ఇట్టి రాజీనామాను ఎవరి ఒత్తిడి లేకుండా తన ఇష్టపరూపంగానే బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. ఇన్ని రోజులు పార్టీలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.రానున్న రోజుల్లో త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను వెల్లాడిస్తానని ప్రవీణ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.