schedule Friday, June 19, 2026

విద్యార్దుల గురించే ఆలోచించే కాస్మోటిక్, మెస్ ఛార్జీలు పెంచినం

calendar_today November 4, 2024
person meenewstelugu

విద్యార్దుల గురించే ఆలోచించే కాస్మోటిక్, మెస్ ఛార్జీలు పెంచినం

పిల్లలు బాగా చదువుకొని ప్రపంచంతో పోటీ పడాలి.

తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చాలి ఇదే మా ప్రభుత్వ లక్ష్యం

 – డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 

 మీ న్యూస్ ప్రతినిధి ::హుజూర్ నగర్ విద్యార్దుల గురించి తమ ప్రభుత్వం ఆలోచన చేసిందని అందుకే దీపావళి కానుకగా డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ఇందిరమ్మ ప్రభుత్వం దీపావళి పండుగ రోజు 7.50 లక్షల మంది నిరుపేద విద్యార్థులు చదువుకునే సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెస్, కాస్మోటిక్స్ చార్జీలు ఒక్కసారిగా 40 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుందామని ఆ మేరకు ఆదేశాలు విడుదల చేశామని తెలిపారు.మూడు నుంచి ఏడవ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల మెస్ చార్జీలు రూ.950 నుంచి రూ.1330కి పెంచామని, 8 నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల మెస్ చార్జీలు రూ.1100 ఉండగా వాటిని రూ.1540కి పెంచామని తెలిపారు. ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యార్థుల మెస్ చార్జీలు రూ.1500 ఉండగా రూ. 2100 పెంచామన్నారు. నేటి మన బిడ్డలే రేపటి పౌరులు వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదివే బాలికలకు 55 రూపాయల నుంచి 175 రూపాయల వరకు పెంచామన్నారు. బాలికలకు 8వ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న కాస్మోటిక్ చార్జీలు రూ. 75 నుంచి రూ. 275 కు పెంచామన్నారు. బాలురకు మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఉన్న కాస్మోటిక్ చార్జీలు రూ. 62 నుంచి రూ.150 కి పెంచామన్నారు. 8వ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారి కాస్మోటిక్స్ చార్జీలను రూ. 62 రూపాయల నుంచి రూ. 200 పెంచామన్నారు. పేద బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చైనా భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. సభలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు ఆనందంతో చప్పట్ల ద్వారా హర్షం వెలబుచ్చారు.