schedule Wednesday, June 17, 2026

ఎమ్మెల్యే చొరవతో గ్రామ అభివృద్ధి దిశగా

calendar_today February 20, 2024
person meenewstelugu
ఎమ్మెల్యే చొరవతో గ్రామ అభివృద్ధి దిశగా

ఎమ్మెల్యే చొరవతో గ్రామ అభివృద్ధి దిశగా

- చింతామణి పట్నంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

దీక్షతెలుగున్యూస్ ,తాండూరు :
తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాము యాదవ్ అన్నారు.తాండూరు మండలం చింతామణి పట్నం గ్రామంలో సిసి రోడ్డు పనులను కాంగ్రెస్ నాయకులు రాము యాదవ్, స్పెషల్ అధికారి ఎంఈఓ వెంకటయ్య గౌడ్ లు కలిసి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా అనంతరం రాము యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినా తదుపరి తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామాల అభివృద్ధి పనులకోసం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధులను విడుదల చేశారని చెప్పారు. ఎన్నడు చేయలేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతాయని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన తీసుకువస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి రవి, రమేష్, యదు, బాలకృష్ణ, నర్సింహులు గౌడ్, లక్ష్మీకాంత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.