schedule Friday, June 19, 2026

మృతుని కుటుంబానికి ఆర్సీ గౌడ్ చేయూత

calendar_today October 23, 2024
person meenewstelugu

మృతుని కుటుంబానికి ఆర్సీ గౌడ్ చేయూత

అంత్యక్రియలకు రూ. 5వేల ఆర్థిక సాయం

తాండూరు రూరల్ మీ న్యూస్ ప్రతినిధి : మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తాండూరు మండల బీసీ సెల్ అధ్యక్షులు ఆర్సీ గౌడ్ (చంద్రశేఖర్ గౌడ్) చేయూత అందించారు. మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన నాగారం వెంకట్ నర్సిములు (బుడ్డన్న) మృతి చెందినవాడు . బుధవారం ఈ విషయం తెలుసుకున్న ఆర్సీ గౌడ్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి . మృతుని అంత్యక్రియల కోసం రూ. 5వేల ఆర్థిక సహయం అందజేశారు. ఇందుకు కుటుంబ సభ్యులు ఆర్సీ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, ఆర్సీగౌడ్ యువసేన సభ్యులు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు