- పట్టభద్రుల భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఏస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు
మీ:: న్యూస్ ప్రతినిధి:: హన్మకొండ జిల్లా : అక్టోబర్ 19, (హుస్నాబాద్ భార్గవాపురం నియోజకవర్గం /ఎల్కతుర్తి మండలం ) తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో.రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని, పట్టభద్రుల సమస్యల పరిస్కారానికి కృషి చేస్తానని, ప్రైవేట్, ప్రభుత్వ నిరుద్యోగులకు బాసటగా నిలుస్తానని భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఏస్ ) ఆశవాహ అభ్యర్థి పిడిశెట్టి రాజు శనివారం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద మాట్లాడుతూ. రానున్న కరీంనగర్ - ఆదిలాబాద్ - నిజామాబాద్ - మెదక్ నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల్లో తనను ఎమ్మెల్సీ గా ఆశీర్వదించి గెలిపిస్తే సేవకుడిగా పని చేస్తూ అందరికి నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు. ఉమ్మడి నాలుగు జిల్లాల వ్యాప్తంగా నిరుద్యోగులకు నైపుణ్యం అభివృద్ధి కేంద్రాల ద్వారా నిరుద్యోగుల్లో నైపుణ్యం పెంపొందించి, వారు సులభంగా ప్రయివేట్, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే విధంగా అందులో శిక్షణ ఇప్పించెందుకు కృషి చేస్తానని అన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజురియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను విడుదలకు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ లను ప్రభుత్వంతో మాట్లాడి విడుదల చేపిస్తానని అన్నారు.ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్స్ విధానం అమలుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, ప్రతి ఏడాది ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేలా కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్సీ గా భారీ మెజారిటీ తో గెలిపిస్తే సేవకుడిగా పని చేస్తూ అందరికి అను నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. మాడల్ స్కూల్ టీచర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిస్కారానికి కృషి చేస్తానని అన్నారు. పోటీ పరీక్షలకు సిద్దపడే అభ్యర్థులు గ్రంథాలయాలకు వెళ్లి అందరూ చదువుకోలేరని, వారి సౌకర్యార్థం ప్రత్యేక యాప్ ను రూపొందిస్తున్నామన్నారు.ఈ యాప్ దేశంలోని అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈకార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న ఉద్యోగులు, గ్రాడ్యుయేట్స్ తదితరులు పాల్గొన్నారు.మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్