schedule Friday, June 19, 2026

ఐద్వా రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయండి.

calendar_today October 18, 2024
person meenewstelugu

ఐద్వా రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయండి.

 ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి

 మీ:: న్యూస్ అక్టోబర్ 18.సూర్యాపేట: అక్టోబర్21,22,23 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగే అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను ఆమె ఆవిష్కరించి మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు అత్యాచారాలు హత్యలు పెరిగాయని విమర్శించారు. మహిళలపై అత్యాచారాలు చేసిన వారిని బిజెపి ప్రభుత్వం రక్షిస్తుందన్నారు.బిజెపి పాలిత రాష్ట్రాలలోమతోన్మాదంతో మహిళలు తినే ఆహారం మీద,కట్టుకునే బట్టల మీద,ఆచార వ్యవహారాల మీద ఆంక్షలు విధిస్తూ మహిళలను బానిసలుగా చూస్తున్నారని ఆమె అన్నారు.కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారిక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. పేద మహిళలందరికీ నెలకు 2500 రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిందని,అధికారంలోకొచ్చి పది నెలలు అవుతున్న ఇచ్చిన హామీని అమలు చేసిన పాపాన పోలేదన్నారు.సామాజిక పింఛన్లు2000 రూపాయల నుండి నాలుగు వేలకు పెంచాలన్నారు. వ్యవసాయ కార్మికులకురాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న12000వెంటనే ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించి మహిళలకు ఉచిత విద్య, వైద్యం, రక్షణ కల్పించాలన్నారు.డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మహిళలు పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. రాష్ట్ర మహాసభల సందర్భంగా అక్టోబర్ 21వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వేలాదిమంది మహిళలతో భారీ ప్రదర్శన, బహిరంగ నిర్వహిస్తున్నామన్నారు. ఈ బహిరంగ సభకు ఆల్ ఇండియా ఐద్వా జాతీయ నాయకురాలు మాజీ ఎంపీ బృందాకరత్ హాజరవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగెళ్ల వెంకట చంద్ర, జిల్లా కోశాధికారి మేకన బోయిన సైదమ్మ, జిల్లా ఆఫీస్ బేరర్స్ సురభి లక్ష్మి,త్రివేణి, ఖాజాబీ, జిల్లా కమిటీ సభ్యురాలు పిండిగా నాగమణి తదితరులు పాల్గొన్నారు