గ్రామ సభలు జరపకుండా ఇష్టానుసారంగా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయడం సరి కాదు
calendar_today
October 18, 2024
person
meenewstelugu
గ్రామ సభలు జరపకుండా ఇష్టానుసారంగా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయడం సరి కాదు
బీజేపీ మండలం అధ్యక్షులు ఓంకార్ యాదవ్
మీ:: న్యూస్ అక్టోబర్ 18.. న్యాల్ కల్ మండల కేంద్రం లోని గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారంగా ఇందిరమ్మ కమిటీలు వేయడం సరికాదని వాటికి మరొకసారి సవరణ చేయాలని బిజెపి న్యాల్ కల్ మండలం అధ్యక్షులు ఓంకార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ రోజు ఇట్టి విషయంపై బిజెపి నాయకులు న్యాల్ కల్ మండలం ఎంపీడీవో రాజశేఖర్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగ ఓంకార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవో ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు లబ్ధి చెందకుండా ఇష్టానుసారంగా కమిటీలు వేయడ సరికాదానికి అన్నారు. ఇందిరమ్మ కమిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు. ఎలాంటి గ్రామసభలు నిర్వహించకుండా పేర్లను ఎలా నిర్ధారిస్తారని పంచాయతీ కార్యదర్శుల నడవడిక పై ఆరా తీయాలని గ్రామ సభలు నిర్వహించకుండా పేర్లను ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. గ్రామ సభలు లేకుండా కమిటీలు వేస్తే కచ్చితంగా అవకతవకలు, కుంభకోణాలు జరిగే పరిస్థితి ఉండకపోలేదన్నారు.గ్రామసభ ద్వారానే ఇట్టి కమిటీలను వెయ్యాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన ఎంపీడీవో కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో న్యాల్ కల్ మండలం ప్రధానకార్యదర్శి మల్లేష్ గంగ్వర్ మండలం సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి లక్ష్మరెడ్డి నవీన్ కుమార్ శివరాజ్ సునర్ విష్ణు ఉప్పరి మల్లేశం తదితరులు ఉన్నారు మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్