schedule Friday, June 19, 2026

నిరుద్యోగులకు ఉపాధి కల్పన లక్ష్యంగా 24గంటలు పని చేస్తా

calendar_today October 9, 2024
person meenewstelugu

నిరుద్యోగులకు ఉపాధి కల్పన లక్ష్యంగా 24గంటలు పని చేస్తా

- పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి 

- యువతకు ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు చేస్తా...

- భారతరాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు 

   మీ:: న్యూస్ అక్టోబర్ 9.. కరీంనగర్ జిల్లా : అక్టోబర్09,(కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం / మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చౌరస్తా ) రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భారత రాష్ట్ర సమితి (బీ. ఆర్.ఎస్) పార్టీ ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి, ప్రముఖ విద్యావేత్తలు పిడిశెట్టి రాజు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చౌరస్తా లో వారు మాట్లాడుతూ... ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా తమ ఓటు నమోదు చేసుకోవాలని ఓటరు నమోదు పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రానున్న కరీంనగర్ - ఆదిలాబాద్ - నిజామాబాద్ - మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో తనకు మద్దతు పలుకాలని కోరారు. అనంతరం అయన మాట్లాడుతూ తన ఎమ్మెల్సీ పరిధిలోని నాలుగు ఉమ్మడి జిల్లా కేంద్రంలో యువతకు ఒక వృత్తి నైపుణ్యం కేంద్రంతో పాటు పోటి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికీ ఉచిత శిక్షణతో పాటు లైబ్రరీ కృషి చేస్తానని అన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా 24గంటలు పని చేస్థానని, ప్రతి ఒక్కరికి బాసటగా నిలిచి వారి పక్షాన పోరాడతానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాల(కే. జీ. వీ. బీ ) లోని ఉపాధ్యాయులకు మినిమం టైం స్కెల్ (ఏం టి ఎస్ ) అమలు చేసి వేతనాలు ఇవ్వాలని ఉపాధ్యాయుల డిమాండ్ ఉందని.... వారి సమస్యలు ప్రభుత్వ దృష్టికీ తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్ ( పీ ఆర్ సి) అమలు, డీ. ఏ పెంపు, ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి సమస్యలపై ప్రభుత్వం ద్రుష్టి కీ తీసుకెళ్తానని అన్నారు.మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్